ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

March 16, 2022

thfg

తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు మారిపోయాయి. కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మే 6వ తేదీకి మారింది. మే 24న చివరి పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి ఏడాది షెడ్యూల్: మే 6న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 11న మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్, 13న మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ, 16న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, 18న కెమిస్ట్రీ, కామ‌ర్స్, 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1, 23న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి. ఇంటర్ రెండో ఏడాది షెడ్యూల్‌: మే 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లీష్, 12న మ్యాథ్స్-2ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్, 14న మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ, 17న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్, 21న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2, 24న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి.