ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

March 18, 2022

bgbd

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇదివరకే ప్రకటించిన పదో తరగతి పాత షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ.. కొత్త తేదీలను శుక్రవారం వెల్లడించింది. తాజా షెడ్యూల్ ప్రకారం… ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు సమావేశం అనంతరం కొత్త షెడ్యూళ్లకు రూపకల్పన చేశారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పేర్కొంది.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్…

ఏప్రిల్ 27- తెలుగు
ఏప్రిల్ 28- సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 29- ఇంగ్లీష్
మే 2- మ్యాథ్స్
మే 4- సైన్స్ పేపర్ 1
మే 5- సైన్స్ పేపర్ 2
మే 6- సోషల్ స్టడీస్

అటు, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.