మైక్ టీవీ నుంచి ప్రేమపాట.. విడువిడువో మావోళ్లు చూస్తరు - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ నుంచి ప్రేమపాట.. విడువిడువో మావోళ్లు చూస్తరు

May 11, 2022

పండగైనా, పబ్బమైనా.. చక్కని పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా కనువిందైన వీడియో సాంగ్స్ అందిస్తున్న మైక్ టీవీ కొత్త పాటను విడుదల చేసింది. పల్లెటూళ్లలో పడచు జంటల మధ్య సాగే ప్రేమను, సరసాలను అచ్చమైన పల్లె గుబాళింపులతో ఈ పాట పరిచయం చేస్తుంది.

‘ఇడుఇడువో నా పైట సెంగులు
ఇడుఇడువో మావోళ్లు చూస్తరు..’
అని అమ్మాయి తన ప్రియుణ్ని సుతారంగా మందలిస్తుంది.
అందుకు అతడు..
‘మనసిచ్చినోణ్ని మనవాడెటోణ్ని
పట్టితినే నీ పైట చెంగును…’ అని ప్రియుడు అంటాడు.
మనసును ఆకట్టుకునే సాహిత్యం, సంగీతం, నృత్యంతో ఈ పాట పల్లెటూరి ప్రేమజంటల మధ్య సాగే వలపును కళ్లకు కడుతుంది. యశ్‌పాల్ రాసిన ఈ పాటను మౌనికా యాదవ్, హన్మంతు నాయక్ ఆలపించారు. సంగీతం ఆడమ్స్ అందించగా శ్రావణి, రంజిత్ నృత్యం చేశారు. డైరెక్టర్, డీవోపీగా తిరుపతి వ్యవహరించారు. ఎడిటింగ్, ఇతర ప్రాసెసింగ్ సంపత్, ఉదయ్ నిర్వహించిన ఈ పాటను అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మించారు.