అరుదైన పామును గుర్తించిన పరిశోధకులు - MicTv.in - Telugu News
mictv telugu

అరుదైన పామును గుర్తించిన పరిశోధకులు

May 10, 2019

పుణెకు చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ బృందం ఓ అరుదైన సరీసృప జాతికి చెందిన పామును గుర్తించారు. భారత్‌లో ఇటువంటి పాములను 70 ఏళ్ల క్రితం కేవలం నాలుగింటినే గుర్తించారు. తాజాగా ఈ సరీసృపాన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్‌ జిల్లాలో కనుగొన్నారు. ముదురు ఎరుపు-గోధుమ రంగులతో ఉండే ఈ అరుదైన జాతికి చెందిన సరీసృపాన్ని ‘పిట్‌ వైపర్స్’ అని పిలుస్తారు. అశోక్‌ కెప్టెన్‌ నేతృత్వంలోని సరీసృప శాస్త్ర అధ్యయన పరిశోధకులు గుర్తించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో జీవవైవిధ్య సర్వే నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లిన పరిశోధకులకు ఈ పాము కనపడింది. ఆ బృందానికి అటవీ ప్రాంతంలోని రందా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. ఆ పామును చూపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

New Species Of Viper With Unique Heat-Sensing Ability Found In Arunachal.

ఈ విషపూరిత పాముకి ప్రత్యేకమైన హీట్‌ సెన్సింగ్‌ ఉంటుందని వారు వెల్లడించారు. ‘అరుణాచల్‌ ప్రదేశ్‌లో పిట్‌ వైపర్స్‌ ఉన్నాయన్న విషయం ఇంత వరకు తెలియదు. వీటిపై మరిన్ని పరిశోధనలు చేయనున్నాం. వాటి అలవాట్లు, అవి ఏం తింటాయి, వాటి సంతానోత్పత్తి, అవి గుడ్లు పెడతాయా? లేదా? అన్న విషయాలను తెలసుకుంటాం’ అని పేర్కొన్నారు.