New Sri Lanka PM to sell airline, print money to pay wages
mictv telugu

అమ్మకానికి శ్రీలంక ఎయిర్‌లైన్స్‌.. గత్యంతరం లేదన్న కొత్త ప్రధాని

May 17, 2022

New Sri Lanka PM to sell airline, print money to pay wagesv

ఆర్ధిక సంక్షోభం కారణంగా నష్టాల్లో కూరుకుపోయిన శ్రీలంక ఇప్పుడప్పుడే కోలుకునే స్థితిలో లేదు. గత వారం మాజీ ప్రధాని మహింద రాజపక్స రాజీనామా అనంతరం యునైటెడ్‌ నేషనల్‌ పార్టీ(యూఎన్‌పీ) అగ్రనేత రణిల్‌ విక్రమసింఘే(73) శ్రీలంకకు 26వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సంక్షోభాన్ని కాస్త అయినా తగ్గించేందుకు ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాల కోసం కరెన్సీని కూడా ముద్రించేందుకు సిద్ధమయ్యారు.

ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులను తిరిగి గాడిలోకి తెచ్చేందుకు , ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను కాపాడేందుకు ఎయిర్ లైన్స్‌ను అమ్మేయాలని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు. మార్చి 2021 చివరినాటికే శ్రీలంక విమానయాన సంస్థ.. 45 బిలియన్‌ రూపీస్‌ (124 మిలియన్‌ డాలర్లు) నష్టాల్లో ఉందని తెలిపారు. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించుకుంది కూడా. విమానయానాన్ని ప్రైవేటీకరించిన తర్వాత కూడా నష్టాలను లంక ప్రభుత్వమే భరించనుంది.