వెలుగులోకి కొత్త విషయం.. వయాగ్రాతో భారీ ప్రయోజనం - Telugu News - Mic tv
mictv telugu

వెలుగులోకి కొత్త విషయం.. వయాగ్రాతో భారీ ప్రయోజనం

June 23, 2022

పురుషత్వం, అంగస్థంభన లోపించిన వారు వాడే వయాగ్రా వల్ల మరో ప్రయోజనం ఉందని పరిశోధనలో వెల్లడైంది. క్యాన్సర్‌ను నయం చేసే శక్తి వయాగ్రాలో ఉంటుందంట. కీమోథెరఫీ కంటే శక్తివంతంగా వయాగ్రా పనిచేస్తుందని యూకేకు చెందిన సంస్థ తన అధ్యయనం ద్వారా ప్రకటించింది. ఎలుకలపై జరిపిన ప్రయోగంలో క్యాన్సర్ కణానికి రక్షణగా ఉండే ఎంజైములను వయాగ్రా అంతమొందిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా గొంతు క్యాన్సర్‌ ఉన్న వారికి వయాగ్రా చాలా మేలు చేస్తుందని సంస్థ తన నివేదికలో తెలిపింది. కాగా, వయాగ్రాను తరచూ వాడడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వాడడం ముఖ్యమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.