ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే అందులో వాట్సప్ ఉండడం కామన్. వీడియోలు, ఫోటోలు, వీడియో కాలింగ్, మెసేజ్ లు ఇలా ఎన్నో సౌకర్యాలు అందులోబాటులో ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఇంకో సౌకర్య రాబోతుంది. అదేంటంటే.. ఒక్కోసారి మనం పొరపాటున ఒకరికి పంపాల్సిన ఫోటోలు, వీడియోలను ఇంకొకరికి పంపిస్తుంటాం. ఒక్కసారి సెంట్ బటన్ ను క్లిక్ చేశామా అంతే మనం డిలీట్ చేసినా అవతలి వాళ్లకు ఆ డేటా వెళ్లిపోతుంది. అయితే తొందరలోనే దానికి పరిష్కారం రాబోతుంది. రీకాల్ బటన్ అని కొత్త టూల్ రాబోతుంది. మీరు ఎవరికైనా పొరపాటున పంపించిన ఫైళ్లను వెంటనే రీకాల్ బటన్ ద్వారా డిలీట్ చెయ్యచ్చు. ఆండ్రాయిడ్ IOS వినియోగదారులకు ఈ టూల్ అందుబాటులో ఉంటుంది.