డాక్టర్ సుధాకర్‌‌కు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు - MicTv.in - Telugu News
mictv telugu

డాక్టర్ సుధాకర్‌‌కు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు

June 5, 2020

New twist in doctor sudhakar case

విశాఖ డాక్టర్ సుధాకర్ కేసులో కొత్త ట్విస్ట్. సుధాకర్ తల్లి కావేరిబాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుధాకర్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని.. 24 గంటల్లో డాక్టర్ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పిటిషన్‌‌ లో పేర్కొన్నారు. అలాగే సుధాకర్ ను మెంటల్ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ కు బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో సుధాకర్ తల్లి కావేరిబాయి హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.

కావేరిబాయి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆయన్ను మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని డిశ్చార్జ్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. అదే సమయంలో ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తుకు సహకరించాలని సుధాకర్ కు హైకోర్టు షరతు విధించింది. దర్యాప్తుకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మరో హాస్పిటల్ లో సుధాకర్ చికిత్స తీసుకునేందుకు హైకోర్టు అనుమతించింది.