రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. ‘దమ్మేశా’ వీడియో.. బేరసారాలు! - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్ తరుణ్ కేసులో ట్విస్ట్.. ‘దమ్మేశా’ వీడియో.. బేరసారాలు!

August 22, 2019

ఆక్సిడెంట్ చేసి పరిపోతున్నా హీరో రాజ్ తరున్ ని నిలదీసిన ఒక వ్యక్తి…..ఆ తరువాత రాజ్ తరుణ్ మేనేజర్ అంటూ ఆ వ్యక్తి బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ పొలీస్ స్టేషన్ ని సంప్రదించిన యువకుడు..

Posted by Common Man Counters CMC on Thursday, 22 August 2019

టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది. అతడు తాను మద్యం తాగినట్లు కెమెరా ముందు స్వయంగా చెబుతున్న వీడియో బయటికొచ్చింది. ఇందులో అతడు ఓ వ్యక్తితో  తాను దమ్మేయడానికి వచ్చానని చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన నార్సింగి అలకాపూర్ ప్రాంతంలో నివసిస్తున్న కార్తీక్ అనే వ్యక్తి  ఈవీడియో తీశాడు. ప్రమాదం తర్వాత ఆచూకీ లేకుండా పోయిన రాజ్ తరుణ్ తర్వాత సెల్ఫీ వీడియోతో బయటికొచ్చి తాను మద్యం తాగనే లేదని, యాక్సిడెంట్ తర్వాత భయంతో పారిపోయానని చెప్పడం తెలిసిందే. అయితే తాజా వీడియోలో ఆయన తాను మద్యం తాగినట్లు ఒప్పుకోవడంతో ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. 

కార్తీక్ చెప్పిన వివరాల ప్రకారం.. 

రాజ్ తరుణ్ నడుపుతున్న కారు గోడను గుద్దుకున్నప్పుడు అక్కడే నివసిస్తున్న కార్తీక్ తన ఇంటి బాల్కనీలోంచి చూశాడు. తర్వాత బైక్ తీసుకుని అక్కడికి వెళ్లాడు. పారిపోతున్న వ్యక్తిని రాజ్ తరుణ్’గా గుర్తించాడు. ‘ఇక్కడేం చేస్తున్నారు ఈ టైంలో. యాక్సిడెంట్ చేసింది మీరేనా’ అని ప్రశ్నించాడు. అందుకు హీరో బదులిస్తూ.. ‘నేను చేయలేదు..’ అని అన్నాడు. ‘మీరి మీ కాళ్లకు చెప్పులు లేవే’ అని కార్తీక్ ప్రశ్నించగా, ‘నేనిట్లే ఉంటాను’ అని రాజ్ తరుణ్ చెప్పాడు. ‘నేను దమ్మేయడానికి వచ్చా, దమ్మేసి వెళ్లిపోతున్నా’ అని ఒప్పుకున్నాడు. దీన్ని కార్తీక్ వీడియో తీశాడు. ఆ సమయంలో రాజ్ తరుణ్ ముఖం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకున్నాడు. తర్వాత కార్తీక్ తన బైక్‌పై రాజ్ తరుణ్‌ను అతని ఇంటి వద్ద డ్రాప్ చేశాడు. ఆ సమయంలో ఫోన్ నంబర్లు తీసుకున్నారు. ‘మా మేనేజర్ రేపు మీతో మాట్లాడతారు’ అని తరుణ్ చెప్పినట్లు కార్తీక్ టీవీ9 చానల్‌తో చెప్పాడు. 

‘మరుసటి రోజు రాజ్ తరుణ్ మనేజర్, నటుడు రాజా రవీంద్ర.. నాకు ఫోన్ చేశారు. నేను తీసిన వీడియోను డిలీట్ చేస్తే  డబ్బులు ఇస్తానని రాజా రవీంద్ర అన్నారు. రూ. 5 లక్షలు ఇస్తే వీడియోను డిలీట్ చేస్తానని చెప్పాను. చివరికి రూ. 3 లక్షలకు బేరం కుదిరింది. డబ్బులు తీసుకుని వస్తే ఆ దృశ్యాలను వీడియోలో రికార్డు చేయాలని అనుకున్నాను.. కానీ వాళ్లు రాలేదు. నేను వీడియో తీస్తానని వారు భయపడ్డారు’ అని కార్తీక్ చెప్పాడు. ఒక మహిళ కూడా తనకు  ఫోన్ చేసి, ‘దమ్మేశా’ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేసిందన్నారు. తాను డబ్బు కోసం బేరాలు పెట్టలేదని, డ్రంక్ డ్రైవ్ ప్రమాదాల గురించి హెచ్చరించడానికే వీడియో తీశానని చెప్పారు. తనను చంపుతామని బెదిరించారన్నారు.

రాజా రవీంద్ర ఏమన్నారు? 

కార్తీక్ ఆరోపణలపై రాజా రవీంద్ర స్పందిస్తూ.. ‘వీడియోను మీడియాకు ఇవ్వాలా అని కార్తీక్ మెసేజ్ పెట్టాడు. కార్తీక్ నుంచి నాకు మిస్డ్ కాల్ వచ్చింది.. ఆయన ఆరోపణలు అబద్ధం..’ అని అన్నారు.