నేతాజీ-గుమ్నామీ మిస్టరీలో ట్విస్ట్.. కీలక నివేదిక గల్లంతు  - MicTv.in - Telugu News
mictv telugu

నేతాజీ-గుమ్నామీ మిస్టరీలో ట్విస్ట్.. కీలక నివేదిక గల్లంతు 

February 21, 2020

fvfvgg

బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ వీడినట్లే వీడి మళ్లీ ముడిపడింది. నేతాజీగా భావిస్తున్న గుమ్నామీ బాబా నేతాజీ కాదని తేల్చిన కమిషన్‌కు కీలక ఆధారమైన నివేదిక గల్లంతైంది. నేతాజీ మిస్టరీని ఛేదించడానికి యూపీ ప్రభుత్వం జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్’ను ఏర్పాటు చేయడం, పలు డాక్యుమెంట్ల ఆధారంగా గుమ్నామీ బాబా నేతాజీ కాదని కమిషన్ ఇటీవలే అసెంబ్లీకి నివేదిక సమర్పించడం తెలిసందే. కోల్’కతాలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబోరేటరీ(సీఎస్‌ఎఫ్‌ఎల్‌)లో ఉన్న ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ పరీక్ష నివేదికను బట్టి గుమ్నామీ బాబా నేతాజీ కాదని కమిషన్ తేల్చింది. డీఎన్ఏ ద్వారా మిస్టరీ ఛేదించడానికి గుమ్నామీ దంతంపై ఈ పరీక్ష జరిపారు. 

ఆ నివేదిక వివరాలు తనకు ఇవ్వాలని సాయక్‌ సేన్‌ అనే నేతాజీ అభిమాని ఆర్టీఐ కింద సీఎస్‌ఎఫ్‌ఎల్‌కు దరఖాస్తు చేశాడు. అయితే తమ వద్ద అలాంటి నివేదిక ఏదీ లేదని సీఎస్‌ఎఫ్‌ఎల్‌ సమాధానమిచ్చింది. దీనిపై సీఎఫ్‌ఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ను సంప్రదించవచ్చని సూచించింది. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. జస్టిస్ సహాయ్ కమిషన్‌ నివేదికకు ఆధారమైన  2005 నాటి ముఖర్జీ కమిషన్‌ నివేదికలో అసలు ఎలక్ట్రోఫీరోగ్రామ్‌ ప్రసక్తే లేదని సాయక్ అంటున్నారు. ఈ వ్యవహారంలో తనకు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నాడు. కాగా, సాయక్ ఆరోపణలు నిజం లేదని నేతాజీ మనవడు, బీజేపీ నేత చంద్రకుమార్‌ బోస్‌ అన్నారు.