New upcoming emojis on iPhone, Android and WhatsApp
mictv telugu

గాడిద, అల్లం, ఫ్లూట్.. కొత్త ఎమోజీలు వస్తున్నాయ్

July 17, 2022

స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న చాలామందికి ఎమోజీల గురించి తెలిసే ఉంటుంది. దాదాపు ప్రతి వ్యక్తి చాటింగ్‌లో ఎమోజీని ఉపయోగిస్తుంటారు. సంతోషం, ప్రేమ, అసూయ.. రకరకాల భావాలను వ్యక్తపర్చుకోవడానికి ఒక్క ఎమోజీ చాలు. సోషల్ మీడియా నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకూ దేనిలోనైనా మన భావోద్వేగాలను ఎదుటివారికి తెలియజేయాలంటే వెంటనే గుర్తొచ్చేది ఎమోజీలు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాల్ని వ్యక్తం చేయడంలో బాగా పాపులర్‌ అయ్యింది ఎమోజీ. అందుకే ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకొంటాము.

ఇక వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా యూనికోడ్ కన్సార్టియం కొత్త ఎమోజీలకు సంబంధించిన ప్రకటన చేసింది. కొత్తగా తీసుకొస్తున్న వాటిలో షేకింగ్‌ ఫేస్‌, లైట్‌ బ్లూ, గ్రే, పింక్‌ రంగుల్లో హార్ట్‌ సింబల్‌, ఐదు రంగులతో నెడుతున్నట్లు చూపించే పది చేతి సింబల్స్‌, దుప్పి గాడిద, పక్షి రెక్క, గోరింక, పెద్దబాతు, జెల్లీ ఫిష్‌, హైసింత్‌ పువ్వు, అల్లం, బఠాని కాయ, విసన కర్ర, మరకాస్‌ సంగీత వాయిద్యం, ఫ్లూట్ , వైఫై సింబల్‌తోపాటు ఖందా (సిక్కు మత చిహ్నం ) సింబల్స్‌ ఉన్నాయి. ఈ ఎమోజీ జాబితాను యూనికోడ్ కన్సార్టియమ్‌ యాపిల్, గూగుల్ సంస్థలకు పంపుతుంది. ఆయా కంపెనీలు ఓకే అన్న తర్వాత.. తగిన మార్పులు చేసి యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారు.