మాస్ లుక్లో మహేష్.. ఆ రోజే టైటిల్తో పాటు థండర్ వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో మూవీ వస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్కు మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న ఈ మూవీ టైటిల్ రివీల్ చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా అదే రోజు ‘మాస్ స్ట్రైక్’ పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ తరహాలోనే ఓ థండర్ లాంటి వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మరో కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేష్ బ్యాక్ సైడ్ ఉన్న ఫొటోను రివీల్ చేశారు. తలకు రెడ్ టవల్ కట్టుకుని, సిగరేట్ తాగుతూ, చెక్స్ షర్ట్లో, రగ్గుడ్ బ్యాక్ గ్రౌండ్‌లో మహేష్ లుక్ ఊరమాస్‌గా ఉండటం విశేషం. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
A MASS Feast For Fans and By Fans! #SSMB28MassStrike to thunder its way on 𝟑𝟏𝐬𝐭 𝐌𝐀𝐘! ⚡😎
SUPER FANS will unveil Striking video at the 𝐓𝐇𝐄𝐀𝐓𝐑𝐄𝐒!! 🤩🎥
Super 🌟 @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli… pic.twitter.com/l3VKLuyqWP
— Haarika & Hassine Creations (@haarikahassine) May 27, 2023