అమెరికా అంతరిక్ష సైన్యం రెడీ.. లోగో ఇదే..  - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికా అంతరిక్ష సైన్యం రెడీ.. లోగో ఇదే.. 

January 25, 2020

new US Space Force logo

భవిష్యత్తులో యుద్ధ రీతి మారబోతున్నది. ఇప్పటికే భూమిపై నుంచి ఆకాశంలో ఉన్న ఉపగ్రహాలను నేలకూల్చే క్షిపణులను భారత్ సహా వివిధ దేశాలు సమకూర్చుకున్న సంగతి తెల్సిందే. అగ్రరాజ్యం ఓ అడుగు ముందుకేసి స్పేస్‌ ఫోర్స్‌ పేరుతో అంతరిక్షంలో ఆర్మీని ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తులో ‘స్పేస్‌ వార్‌’ సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా ఏర్పాటు చేసిన అంతరిక్ష దళానికి తాజాగా లోగో విడుదల చేసింది. ఉన్నత స్థాయి సైనికాధికారులు, రూపకర్తలతో పాటు మరికొంత మంది నిపుణులను సంప్రదించి లోగోను ప్రజల ముందుకు తెస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. 

అయితే ఈ లోగో ప్రముఖ సైన్స్‌ ఫిక్షన్‌ ఆన్‌లైన్ మీడియా ఫ్రాంచైజీ ‘స్టార్‌ ట్రెక్‌’ లోగోను పోలి ఉందని విమర్శలు వచ్చాయి. భూమి చుట్టూ తిరుగుతున్న ఓ ఉపగ్రహం, దానిపై రాకెట్‌ని సూచించేలా బాణం గుర్తుతో లోగోను రూపొందించారు. బాణం కింది భాగంలో 2019 అని రోమన్‌ సంఖ్యామానంలో రాసి ఉంది. వృత్తాకారంలో ఉన్న ఈ లోగో కిందిభాగంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అని.. పై భాగంలో యునైటెడ్‌ స్టేట్స్‌ స్పేస్‌ ఫోర్స్‌ అని రాసి ఉంది. ‘స్టార్‌ ట్రెక్‌’ లోగో కూడా దాదాపు ఇలాగే ఉండడం గమనార్హం. దీని ద్వారా అమెరికాకు ఆరు రకాల యుద్ధ బలగాలను సమకూర్చుకుంది. యుఎస్ ఆర్మీ, యుఎస్ నేవి, యుఎస్ కోస్ట్ గార్డ్, యుఎస్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ మెరైన్ కాస్ట్ గార్డ్, యుఎస్ స్పేస్ ఫోర్స్ వాటిలో ఉన్నవి.