కరోనాలో కొత్త వేరియంట్.. ఈ సారి ఇజ్రాయెల్‌లో - MicTv.in - Telugu News
mictv telugu

కరోనాలో కొత్త వేరియంట్.. ఈ సారి ఇజ్రాయెల్‌లో

March 17, 2022

uu

మూడు వేరియంట్ల తర్వాత కరోనా కాస్త తగ్గుముఖం పడుతుందనుకున్న వేళ, కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనా, కొరియా సహా కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్‌లో కొత్త వేరియంట్ కనుగొన్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఒమిక్రాన్ వెర్షన్‌లోని రెండు సబ్ వేరియంట్లు బీఏ 1, బీఏ 2లు కలిసి కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందిందని తెలిపింది. ‘ విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించాం. మా దేశంలోనే పుట్టినట్టుగా భావిస్తున్న ఈ వైరస్ గురించి ప్రపంచానికి ఇంకా తెలియదు. వ్యాధి తవ్రత ఎలా ఉందో తెలుసుకోవాలంటే అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని అనుకుంటున్నామని’ అక్కడి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్వల్ప లక్షణాలు మినహా ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు లేవని వారు వెల్లడించారు.