ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త వైరస్.. అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు
ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ వాడేవాళ్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కొత్తగా వచ్చిన ‘దామ్’ అనే వైరస్తో పెద్ద ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ వైరస్ ఫోన్లలోకి చొరబడి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తుందని, అంతేకాకుండా కాల్ రికార్డ్స్, కాంటాక్టులు, హిస్టరి, కెమెరా తదితర యాప్స్, డేటాను తన ఆధీనంలోకి తీసుకుంటుందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది.
దామ్ వైరస్ను దూరం పెట్టాలంటే.. సింపుల్గా అనుమానాస్పద లింక్స్ను క్లిక్ చేయొద్దని, ఓటీపీలు షేర్ చేయొద్దని ప్రజలను కోరింది. ఈ వైరస్ మొబైల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్లను కూడా బోల్తా కొట్టించి, దానికి అనుగుణంగా రాన్సమ్వేర్ను డెవలప్ చేసుకుంటుందని తెలిపారు. దీనివల్ల సైబర్ దాడులు ఎక్కువవుతాయని, ఫిషింగ్, హ్యాకింగ్ ల బారిన పడే అవకాశాలు ఉంటాయని కేంద్ర సైబర్ టీం తెలిపింది.
అంతేకాకుండా.. మొబైల్లో ఉన్న డేటా, రీడింగ్ హిస్టరీ, బుక్ మార్క్స్ తదితర కీలక అంశాలను దామ్ వైరస్ దొంగలిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్ను నిలిపేసి.. కాల్ రికార్డ్స్, డేటాను కూడా హ్యాక్ చేస్తుందని సైబర్ సెక్యైరిటీ టీం తెలిపింది.