Home > Featured > వాట్సాప్ వెరిఫికేషన్ మెసేజీలు.. క్లిక్ చేస్తే మటాష్ 

వాట్సాప్ వెరిఫికేషన్ మెసేజీలు.. క్లిక్ చేస్తే మటాష్ 

స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల డేటాను చోరీ చేసేందుకు హ్యాకర్లు లెక్కలేనన్ని దారులు వెతికి మరీ చోరీ చేసేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో వాట్సాప్ నిత్యకృత్యం అయిపోయింది. ఈ క్రమంలో వాట్సాప్ నుంచి సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉందని తాజాగా వాట్సాప్‌ టెక్నికల్‌ టీమ్‌ తన వినియోగదారులను హెచ్చరించింది. ‘హ్యాకర్లు మీ మొబైల్‌ నంబర్‌ను తెలుసుకుని వాట్సాప్‌ అకౌంట్‌కు ఒక మెసేజ్ పంపుతారు. అందులో వాట్సాప్‌ ఖాతా వెరిఫికేషన్‌ అంటూ వారు పంపిన ఆరు అంకెల పిన్‌ ఎంటర్‌ చేయమని అడుగుతారు. పొరపాటున ఆ పిన్‌ ఎంటర్‌ చేశారో మీ వాట్సాప్‌ ఖాతా వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇతరులకు మీరు పంపే మెసేజ్‌లు, షేర్ చేసే ఫోటోలు, వీడియోలు అన్నింటినీ వారు గమనిస్తారు. అంతేకాదు, మీ స్నేహితులకు, బంధువులకు, ఇతర గ్రూప్‌లకు కూడా దీన్ని షేర్‌ చేయాల్సిందిగా కోరతారు.

ఇలాంటి వాటిని అస్సలు నమ్మవద్దు’ అని వాట్సాప్‌ తన వినియోగదారులను కోరుతోంది. వెరిఫికేషన్‌ గురించి తామెప్పుడూ అడగమనీ.. ఒకవేళ వినియోగదారులకు ఏదైనా తెలియజేయాలనుకుంటే బ్లూ టిక్‌ ఉన్న ఖాతా నుంచి మాత్రమే మెసేజ్ వస్తుందని వాట్సాప్‌ టీమ్‌ చెబుతోంది. పొరపాటున ఇలాంటి సందేశాలకు స్పందిస్తే, వెంటనే మీ డివైజ్‌లోని వాట్సాప్‌ ఖాతాను లాగౌట్‌ చేసి, మళ్లీ రీ వెరిఫైయింగ్‌ చేసుకోవాలని వాట్సాప్‌ టీమ్‌ చెప్పింది.

Updated : 2 Jun 2020 4:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top