New year effect..lockdown again there
mictv telugu

కొత్త సంవత్సరం ఎఫెక్ట్..అక్కడ మళ్లీ లాక్‌డౌన్

September 6, 2022

చైనా దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా చైనా ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధిస్తూ, తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాలో కొత్త సంవత్సరం కారణంగా ప్రయాణాలు భారీగా పెరిగే అవకాశం ఉండడంతో, ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయంతో చైనా దేశంలో దాదాపు ఆరున్నర కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడనుందని, నైరుతి చైనాలోని 2.1 కోట్ల మంది చెంగు నగరవాసులు తమ అపార్టుమెంట్లకే పరిమితమయ్యారని, తూర్పున ఉండే నౌకా నగరమైన టియాంజిలో 14 కొత్త కేసులు రావడంతో, ఆన్‌లైన్‌లో క్లాసులు మొదలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇక, సోమవారం రోజు చైనాలో కొత్తగా 1,552 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య తక్కువే అయినా, ప్రభుత్వం తన ‘జీరో-కొవిడ్ విధానంలో భాగంగా లాక్‌డౌన్లు, క్వారంటైన్లు విధిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది.

”ఈ నెల 10వ తేదీ నుంచి 12 వరకు చైనాలో కొత్త సంవత్సరం తర్వాత సెలవులు రానున్నాయి. సెలవుల కారణంగా ప్రయాణాలు ఎక్కువవుతాయి. దీని కారణంగా కరోనా మళ్లీ విపరీతంగా విస్తరిస్తుంది. అందుకే కరోనాను నియంత్రించేందుకు మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం. దీనివల్ల ఆర్ధిక వ్యవస్థ, రవాణా రంగం, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయినా, తప్పదు. ప్రస్తుతం 33 నగరాల్లో కఠినంగా ఆంక్షలు విధించాం” అని అక్కడి వార్తా సంస్థలు తెలిపాయి.