పండగ పూట కూడా పాత.. అని ఓ మొరటు సామెత. దాని వెనుక చాలా చరిత్రే ఉందంటారు. ఆ సంగతి వదిలేద్దాం.. ఎప్పుడూ పాతవి కాకుండా పండగ పూటైనా కాస్త కొత్తవాటిని టేస్ట్ చెయ్యకపోతే ఈ మానవ జన్మ ఎందుకు చెప్పండి?
కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి ధూంధూం చేసేస్తారు. అంతా ఒక చోట చేరినప్పుడు పసందైన వంటకాలు ఉంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. కానీ ఎప్పుడూ చేసే వంటకాలు ట్రై చేస్తే పెద్దగా ఆసక్తి ఉండదు. అంతా కొత్త రుచులు కోరుకుంటూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఇటువంటి కొత్త వంటకాలు చేసుకుంటే ఆనందంతో పాటు మంచి అనుభూతిని కూడా పొందవచ్చు. మరి ఈ 2023 సంవత్సరం ప్రారంభంలో ఓసారి ఆ వంటలు ప్రయత్నించి చూడండి.
చెర్రీ టమోటాలతో కానాప్స్ :
బ్రెడ్,చెర్రీ,టమాట,జున్ను, బాసిల్ ఉపయోగించి దీన్ని తయారు చేసుకోవాలి.
తయారీ విధానం : చెర్రీ టమోటాలను సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకొని దానిపై జున్ను పొరను వేయాలి. ఆ తర్వాత కొన్ని చెర్రీ,తులసి ఆకులు పేర్చుకోవాలి. టమాటలతో డెకరేట్ చేసుకొని తింటే ఆ మజానే వేరు. పైగా దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది.
చికెన్‌తో సలాడ్ :
దీనికి చికెన్, క్యాబేజీ, మిరియాలు,జున్ను, మొక్క జొన్న,తెలుపు క్రాకర్స్,నువ్వులు ఉపయోగించాలి.
తయారీ విధానం : మాంసం ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ పెప్పర్, క్యాబేజీ మొక్కజొన్న, జున్నుక్రాకర్లను వేసి, ఆరెంజ్ మాండరిన్ రసాన్ని పోసి కలుపుకోవాలి. ఆ తర్వాత నువ్వులు జోడించి తినేయడమే..
ఆమ్లెట్ యొక్క రోల్స్ :
4 గుడ్లు,2 దోసకాయలు,తీపి మిరియాలు,1 ఉల్లిపాయ, 1 చిన్న బంచ్,ఒక బేకింగ్ షీట్,నూనె,ఉప్పు,మిరియాలు.
తయారీ విధానం : ఉప్పు,కారం, కలిసిన గుడ్డు సొనతో ఆమ్లెట్ వేసుకోవాలి. స్వీట్ మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి ఆమ్లెట్ రోల్స్‌గా తయారు చేయాలి. వెంటనే సర్వ్ ప్లేట్లోకి తీసుకొని తింటే సరిపోతుంది.
గోంగూర మటన్ :
అరకిలో మటన్,3 గోంగూర కట్టలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, టేబుల్ స్పూన్ గరం మసాలా,ఉల్లిపాయలు,జీలకర్ర పొడి, టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూను, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, కారం.
తయారీ విధానం : కుక్కర్లో మటన్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వరకు మాంసాన్ని ఉడికించాలి. తర్వాత దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, గోంగూర ముద్ద కలపాలి. ఆ తర్వాత ప్యాన్‌లో నూనె పోసి దాన్ని కొంత సేపు ఉడికించాలి. ఆ తర్వాత దనియాల పొడి, ఇతర మసాలాలు కలుపుకొని కొంతసేపు ఉడికిస్తే నోరూరించే గోంగూర మటన్ రెడీ.
చికెన్ ఫింగర్స్ :
అరకేజీ చికెన్,అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా ఆకులు, తరిగిన ఉల్లిపాయ,తగినంత ఉప్పుూ, కారం,నిమ్మరసం, గరం మసాల,ఒక టేబుల్ స్పూన్ నూనే, కోడిగుడ్డు, బ్రెడ్ పొడి.
తయారీ : చికెన్‌ను శుభ్రంగా కడిగి దాన్ని పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం నూనె, కోడిగుడ్డు, బ్రెడ్ పొడి వేసి మిశ్రమాన్నిసిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్ పాన్‌లో పావుగంట బేక్ చేయాలి. వెంటనే మీరు చికెన్ ఫింగర్స్‌ను వేడిగా తినేస్తే బాగుంటుంది.