ఎల్లుండి కొత్త సంవత్సరం జోష్ మొదలుకానున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వేడుకలకు ఇబ్బంది రాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంక్షలు విధించారు. శనివారం రాత్రి 10 నుంచి ఆదివారం పొద్దున 5 గంటల వరకు అన్ని కీలక ఫ్లైఓవర్స్ బంద్ కానున్నాయి. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, ఓఆర్ఆర్ సైతం మూతపడనున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలను మాత్రం మినహాయింపు ఇచ్చారు. న్యూ ఇయర్ పేరుతో డ్రంక్ అండ్ డ్రైవ్ అల్లరి చేసినా, యాక్సిడెంట్లు చేసినా కొరడా ఝళిపించనున్నారు. శిల్పా లే అవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ-1, 2, షేక్‌పేట, మైండ్‌స్పేస్, రోడ్ నం. 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్, ఫోరం మాల్- జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ తదితర ఫ్లైఓవర్లపై వెళ్లేవాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.
ఆంక్షలు, హెచ్చరికలు..
క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. అధిక చార్జీలు వసూలు చేస్తే 9490617346 నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.
క్లబ్బుల్లో, బార్లలో మందుకొట్టినవారు డ్రైవింగ్ చేయకూడదు. మద్యం తాగి బండ్లు నిడిపితే జరిమానాతోపాటు జైలు శిక్ష.
వాహనాల్లో భారీ సౌండుతో మ్యూజిక్ పెట్టుకుంటే కఠిన చర్యలు.
నంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని బండ్లు స్వాధీనం చేసుకుంటారు.
ఇవి కూడా చదవండి :
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్..మరో 30 స్పెషల్ ట్రైన్స్…
ఏపీ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా…..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం