New Zealand enter into semis
mictv telugu

సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్..

November 4, 2022

ఆసక్తికరంగా సాగుతున్న టీ 20 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన మొదటి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఐర్లాండ్ పై 35 పరుగులతో విజయం సాధించి..
నేరుగా సెమీస్‌కు దూసుకుకెళ్లింది.ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమి, ఓ మ్యాచ్ రద్దుతో మొత్తం ఏడు పాయింట్లు సాధించి గ్రూప్ -1లో సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది కివీస్. ఈ గ్రూప్‌లో మరో స్థానం కోసం ఇంగ్లాండ్, ఆసీస్ మధ్య తీవ్ర పోటీ ఉండగా..శ్రీలంకు కూడా స్వల్ప అవకావాలున్నాయి.

ఐర్లాండ్‌పై మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్‎షో తో అదరగొట్టింది. టాస్ ఓడి, మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35 బంతుల్లో 61) మెరుపు అర్ధ శతకంతో రాణించాడు. ఓపెనర్లు ఫిన్ అలెన్ (18 బంతుల్లో 32), డెవాన్ కాన్వే (28), డారిల్ మిచెల్ (31 నాటౌట్)తో సత్తా చాటారు. ఐర్లాండ్ బౌలర్ జె.లిటిల్ హ్యాట్రిక్ సాధించాడు.

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 150 పరుగులకే చేతులెత్తేసింది.ఆ టీమ్ ఓపెనర్లు స్టిర్లింగ్(37), బాల్‌బ్రైన్(30) పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్ మెన్స్ విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ 3 వికెట్లు సాధించగా, సౌథీ, సాంట్నర్, సోథి రెండేసి వికెట్లతో రాణించారు.