వరుసగా రెండోసారి న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండా - MicTv.in - Telugu News
mictv telugu

వరుసగా రెండోసారి న్యూజిలాండ్‌ ప్రధానిగా జసిండా

October 18, 2020

gnghngh

న్యూజిలాండ్‌ ప్రధానిగా వరుసగా రెండోసారి జసిండా ఆర్డెర్న్‌ ఎన్నికయ్యారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జసిండా నేతృత్వంలోని సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ విజయం సాధించింది. మొత్తం 120 సభ్యులు ఉన్న పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ 64సీట్లు సొంతం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఆసక్తికర సంఘటన జరిగింది. 70 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధాన ప్రత్యర్థి జుడిత్ కాలిన్స్‌ ఓటమిని అంగీకరించారు. 

దీంతో జేసిండా విజయం ఖాయమైంది. 70 శాతం ఓట్లు లెక్కించే సరికి లేబర్‌ పార్టీ 49.2 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి న్యూజిలాండ్‌ ప్రజలు తొలిసారి పూర్తి మెజార్టీతో గెలిపించారు. సుమారు 77శాతం బ్యాలెట్లను లెక్కించగా లేబర్‌ పార్టీకి 49శాతం, నేషనల్‌ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపుచేయడంలో జేసిండా కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రజలు ఆమెను మరోసారి గెలిపించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.