నేను గంజాయి తాగా.. న్యూజిలాండ్ ప్రధాని సంచలనం - MicTv.in - Telugu News
mictv telugu

నేను గంజాయి తాగా.. న్యూజిలాండ్ ప్రధాని సంచలనం

October 2, 2020

New Zealand Prime Minister on Ganja

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల17వతేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించారు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు గంజాయి తీసుకున్నానని వెల్లడించారు.  చర్చలో మోడరేటర్ మీరు ఎప్పుడైనా గంజాయిని ఉపయోగించారా అని ప్రశ్నకు సమాధానంగా ఇది బయటపెట్టారు. 

ప్రస్తుతం అక్కడ గంజాయి చట్టవిరుద్ధం. కానీ దీన్ని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇది ప్రజాప్రాయ సేకరణగా పేర్కొన్నారు. గంజాయి విషయంలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. అయితే తాను ఎప్పుడూ గంజాయిని ఉపయోగించలేదని ప్రత్యర్థి సంప్రదాయక జాతీయ పార్టీ నేత జుడిత్ కాలిన్సు వెల్లడించారు.  దానికి తాను వ్యతిరేకమన్నారు. అందుకే ప్రజలు కూడా తనకు మద్దతుగా ఓటు వేస్తారని ధీమాగా చెప్పారు.  కాగా, యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జసిందా ఆర్డెన్ విజయం సాధించారు. ఆమె పాలన దక్షతతో అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.