సూర్యకుమార్ షాట్లకు దండం :కేన్ మామా - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యకుమార్ షాట్లకు దండం :కేన్ మామా

November 20, 2022

న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్ ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 52 బంతుల్లో 111 పరుగులు చేసి కెరీర్‌లో రెండో సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక సూర్యకుమార్ సంచలన బ్యాటింగ్‌పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. మ్యాచ్ అనంతరం మాట్లాడిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సూర్యకుమార్ యాదవ్‌ను పొగడ్తులతో ముంచెత్తాడు.

“ప్రపంచలోనే ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అద్భుతం. ఇప్పటి వరకు అలాంటి షాట్‌లు నేను చూడలేదు. అతని ఇన్నింగ్స్ కారణంగానే ఓటమి పాలయ్యాం. సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు” అని కేన్ మామ ప్రశంసించాడు. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమి చవిచూశామని..తిరిగి మళ్లీ పుంజుకుంటామని విలియమ్సన్ తెలిపాడు. తమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైందని అంగీకరించాడు. ఆటలోఇవన్నీ సహజమని పేర్కొన్నాడు.