New Zealand to consider allowing 16-year-olds to vote after discrimination ruling
mictv telugu

16 ఏండ్లకే ఓటు హక్కు.. త్వరలోనే కొత్త చట్టం!

November 22, 2022

16 ఏళ్ల వయస్సు రాగానే ఓటు హక్కు కల్పించనుంది న్యూజిలాండ్‌ దేశం. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. 16 ఏళ్లు రాగానే ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు వయసు తగ్గించేందుకు విధి విధానాలపై ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. ఓటరు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని న్యూజిలాండ్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ జెసిండా ఆర్డెర్స్‌ భావిస్తున్నారు. త్వరలోనే ఈ చట్టాన్ని తీసుకువస్తానని పార్లమెంటులో హామీ ఇచ్చారు.

ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఆధారంగా జెసిండా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు దాటిన వాళ్ల‌కే ఓటు హ‌క్కు క‌ల్పించ‌డం అంటే యువ‌త మావ‌న హ‌క్కుల్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ దేశ సుప్రీంకోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. దీంతో ఓటు హ‌క్కు వ‌య‌సును కుదించేందుకు ప్ర‌ధాని జెసిండా ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భుత్వం పాస్ చేసే బిల్లుకు పార్ల‌మెంట్‌లోని 75 శాతం మంది ఎంపీలు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. బ్రెజిల్‌, ఆస్ట్రియా, క్యూబా దేశాలు మాత్రం 18 ఏళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న వారికి ఓటు వేసే హ‌క్కుల్ని క‌ల్పిస్తోంది.