శ్రేయాస్ అయ్యర్ సెంచరీ..భారీ స్కోర్ సాధించిన టీమిండియా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రేయాస్ అయ్యర్ సెంచరీ..భారీ స్కోర్ సాధించిన టీమిండియా

February 5, 2020

xdfj nb

 హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ (103) సెంచరీతో చెలరేగాడు. కెరీర్‌లో 16వ వన్డే ఆడుతున్న శ్రేయాస్‌కి ఇది తొలి సెంచరీ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు పృథ్వీ షా (20), మయాంక్ అగర్వాల్ (32) విఫలమయ్యారు. 

దీంతో 9వ ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (51)తో కలిసి మూడో వికెట్‌కి 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే.. జట్టు స్కోరు 156 వద్ద కోహ్లీ ఔటవడంతో వీరి భాస్వామ్యానికి బ్రేక్ పడింది. 107 బంతుల్లో 11 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 103 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్ టిం సౌథీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (86), కేడర్ జాదవ్ (24) ఉన్నారు. 50 ఓవర్లు ముగిసే సరికి కోహ్లీ సేన 4 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది.