భారత్-న్యూజిలాండ్ జట్లు మూడో వన్డేకు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా భారత్ బ్యాటింగ్‌కు చేసేందుకు సిద్దమైంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో భారత్ టీంలో రెండు మార్పలను చేశారు.బౌలర్లు షమీ, సిరాజ్ లకు విశ్రాంతి కల్పించి..ఇప్పటివరకు సిరీస్‌లో బరిలో దిగని చాహల్, జమ్మూ ఎక్స్ ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం కల్పించారు. న్యూజిలాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. బౌలర్ హెన్రీ షిల్పీ స్థానంలో జాకబ్ డఫ్పీ వచ్చాడు. ఇక సిరీస్ చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తుంటే..రెండు వన్డేల తరహలో మూడోది కూడా కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేయాలని భారత్ తహతహలాడుతోంది. ఈ క్రమంలో నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకోవాలని ఎదురుచూస్తోంది.