బతికి ఉన్న పసికందు.. చచ్చిపోయాడన్న వైద్యులు.. - MicTv.in - Telugu News
mictv telugu

బతికి ఉన్న పసికందు.. చచ్చిపోయాడన్న వైద్యులు..

December 2, 2017

వైద్యుల లీలలు ఇన్నిన్నికాదు.. శవాలపై పైసలు ఏరుకునే వైద్యులు కొందరైతే, నిర్లక్ష్యంతో విలువైన ప్రాణాలు బలితీసుకునే మహానుభావులు మరికొందరు. ఢిల్లీలో ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యులు.. జీవించి ఉన్న పసికందును చచ్చిపోయాడని చెబుతూ ప్లాస్టిక్ సంచిలో పెట్టేసి తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత అసలు సంగతి తేలడంతో పెద్ద దుమారం రేగింది.షాలిమార్ బాగ్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో గురువారం ఒక మహిళ కవలలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే ప్రసవం జరిగింది. ఒక బిడ్డ చనిపోగా, ఒక బిడ్డ పరిస్థితి విషమంగా  మారింది. కాసేపటి తర్వాత అతడు కూడా చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఇద్దరి పసికందుల మృతదేహాలను ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

వారు దు:ఖాన్ని దిగమింగుకుని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో..  ఆరోగ్యం విషమించి చనిపోయాడని వైద్యులు చెప్పిన బిడ్డ బతికి ఉన్నట్లు తేలింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. ఇటీవల ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలోనూ ఇలాంటి ఘటనే జరింగి. బతికున్న నవజాత శిశువు చనిపోయాడని వైద్యలు చెప్పి, తర్వాత మొట్టికాయలు వేయించుకున్నారు.