ముఖంపై కత్తిగాటుతో పుట్టిన బిడ్డ.. ఏం డాక్టర్లరా ద్యావుడా! - MicTv.in - Telugu News
mictv telugu

ముఖంపై కత్తిగాటుతో పుట్టిన బిడ్డ.. ఏం డాక్టర్లరా ద్యావుడా!

February 3, 2020

baby girl

వీరబ్రహ్మం చెప్పారని, ఏవేవో జరుగుతాయని అప్పడప్పుడూ వార్తలు వస్తుంటయి. కరోనా వైరస్ గురించి కూడా ఆయన శతాబ్దాల కిందట ‘కరోంకీ’ అని హెచ్చరించాడని చెబుతున్ను. ఆ సంగతి పక్కన బెడితే.. ఓ రష్యాలో ఓ చిన్నారి పుట్టుకతో కత్తిగాటుతో పుట్టేసింది. డాక్టర్ల నిర్వాకం వల్ల ఈ ‘వింత’ చోటుచేసుకుంది.  

నార్విచ్ యూనివర్సిటీ ఆస్పత్రిలో దారాయ కడోచ్‌నికోవా అనే అనే యువతి డాక్టర్లు సిజేరియన్ చేశారు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్జరీ కత్తి గర్భంలోని బిడ్డ ముఖాన్ని కొంత కోసేసింది. చేతుల్లకి వచ్చిన కూతుర్ని అలా చూసిన ఆ తల్లి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే తాము, సరిగ్గానే చేశామని, ఆ పిల్ల సర్జరీ సమయంలో ఉండాల్సిన స్థానంలో కాకుండా పక్కకు జరగడంతో అలా జరిగిందని వైద్యోనారాయణోహరులు చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఆ పిల్ల ఆపరేషన్ సమయంలో కదలకుండా మెదలకుండా ఉండిపోయిందని అన్నారు.