సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి.. తల్లి కళ్ళముందే శిశువు మాయం - MicTv.in - Telugu News
mictv telugu

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి.. తల్లి కళ్ళముందే శిశువు మాయం

May 8, 2019

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యమైన సంఘటన సంచలనం రేకిస్తుంది. శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కల్పగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి గత నెల 30న జిల్లా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 3న బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. శిశివుని పరీక్షించిన వైద్యులు ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. మంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎస్‌ఎన్‌సీయూలోకి వచ్చింది. అక్కడే ఉన్న ఆయా వనిత ఆమెను మాధవిగా భావించి బిడ్డను ఆమెకు అప్పగించింది.

Newborn baby missing from sangareddy hospital.

ఆ తర్వాత కొంచెం సమయం తరువాత బిడ్డను చూసేందుకు వెళ్లిన మాధవికి అక్కడ కనిపించకపోవడంతో ఆయాను ప్రశ్నించింది. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. ఆసుపత్రి మొత్తం గాలించినా కూడా బిడ్డ కనిపించకపోవడంతో మాధవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌ పగలగొట్టారు. ఆసుపత్రిలోని ఆర్‌ఎంఓ ఛాంబర్‌లో సీసీ ఫుటేజీలను పరీక్షించగా బిడ్డను ఓ గుర్తు తెలియని మహిళ బయటకు తీసుకెళ్తున్నట్టు రికార్డైంది. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా వనితను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.