వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్తపెళ్లికొడుకు.. ఏకంగా 20 రోజులు, ఆస్పత్రికి.. - Telugu News - Mic tv
mictv telugu

వయాగ్రా ఓవర్ డోస్ తీసుకున్న కొత్తపెళ్లికొడుకు.. ఏకంగా 20 రోజులు, ఆస్పత్రికి..

June 7, 2022

స్నేహితులు చెప్పారని ఓ కొత్త పెళ్లికొడుకు మోతాదుకు మించి వయాగ్రా మాత్రలను తీసుకున్నాడు. ఫలితంగా కొత్తగా వచ్చిన భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో పాటు హాస్పిటల్‌లో జాయిన్ కావాల్సి వచ్చింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్ని నెలల క్రితం పెళ్లయింది. తర్వాత జరిగే శోభనం కార్యక్రమానికి ఉత్సాహంగా వేచి చూస్తుండగా, అతని స్నేహితులు ఎంటరయ్యారు. శోభనం రోజు ఫెయిల్ అవకూడదనీ అందుకోసం వయాగ్రా మాత్రలను వేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో వారి సూచన మేరకు సదరు యువకుడు మోతాదుకు మించి మాత్రలను వేసుకున్నాడు. సాధారణంగా రోజుకు 50 మిల్లీ గ్రాముల వయాగ్రా మాత్రలు వేసుకోవాల్సి ఉండగా, ఇతను మాత్రం రోజుకు 200 మిల్లీ గ్రాముల వయాగ్రాను వేసుకున్నాడు. ఫలితంగా 20 రోజుల పాటు అంగస్తంభనతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. అతని తీరుతో  విసిగిపోయిన కొత్త భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. బంధువులు ఎలాగో సర్ది చెప్పి తీసుకొచ్చారు. అయితే ఎంతకీ భర్త చేతులారా తెచ్చుకున్న సమస్య తీరకపోవడంతో మరోసారి పుట్టింటికి వెళ్లిపోయింది. దాంతో వేరే దారిలేక బంధువులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. ‘సాధారణంగా ఈరెక్టిల్ డిస్ఫంక్షన్ సమస్య ఉన్నవారికి మాత్రమే వయాగ్రాను ఆఫర్ చేస్తారు. కానీ, యువకుడు అవసరం లేకున్నా పరిమితికి మించి మందులు తీసుకున్నాడు. దాంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇక ఆ వ్యక్తి పిల్లలను కనడంలో ఎలాంటి ఇబ్బంది పడడు కానీ, ప్రైవేటు పార్టు మాత్రం ఎప్పటికీ గట్టిగానే ఉంటుంది. అంగస్తంభనను దాచడానికి గట్టి గుడ్డ కట్టుకోవాల్సి ఉంటుంద’ని వివరించారు.