భారత్‌లో కొత్తగా 15,940 కరోనా కేసులు: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కొత్తగా 15,940 కరోనా కేసులు: కేంద్రం

June 25, 2022

భారతదేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. గురువారంతో పోలిస్తే, శుక్రవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 15,940 కరోనా కేసులు నమోదు అయ్యాయని విడుదల చేసిన బులెటెన్‌లో తెలిపింది.

”గురువారం 17వేలకుపైగా కేసులు వచ్చాయి. నేడు ఆ సంఖ్య 15,940కి తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,33,78,234కు చేరాయి. ఇందులో 4,27,61,481 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 5,24,974 మంది మరణించారు. మరో 91,779 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 20 మంది మరణించగా 12,425 మంది డిశ్చార్జీ అయ్యారు.”

ఇక, యాక్టివిటీ రేటు, మరణాల రేటు, రోజువారీ పాజిటివిటీ రేటు విషయానికొస్తే.. యాక్టివిటీ రేటు 0.21 శాతం, రికరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 196.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.