Newly wed bride passed away in first night nuptial bed annamayya district
mictv telugu

శోభనం గదిలో వరుడు మృతి.. ప్రేమవివాహం విషాదం..

September 14, 2022

ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుఖ సంతోషాలతో జీవించాలని ఎన్నో కలలుగన్నారు. కానీ మృత్యువు ఊహించని రూపంలో అతణ్ని బలితీసుకుని ఆమె జీవితంలో కారుచీకట్లు నింపింది. పెళ్లయి ఒక రోజు కూడా గడవకుండానే వరుడు శోభనం గదిలో కుప్పకూలి చనిపోయాడు. అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పాకాల మండలం పత్తిపాటివారిపల్లెకు చెందిన తులసీ ప్రసాద్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శిరీషతో ఫేస్బుక్ ద్వారా మొదలైన పరిచయం పెళ్లికి దారితీసింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. తులసీ ప్రసాద్ పిన్ని ఉంటున్న మదనపల్లెలో సోమవారం ఘనంగా పెళ్లి జరిగింది. తర్వాత ప్రసాద్ శోభనం గదిలో తెల్లవారు జామున చలనం లేకుండా పడిపోయాడు. శిరీష అనుమానంతో కేకలు వేయగా బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. శోభనం గదిలో ఏం జరిగిందో తమకు తెలియదంటూ మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసి దర్యాప్తు జరపాలని కోరారు.