రేప్‌కు ఒప్పుకోలేదని కొత్త పెళ్లికూతురికి గుండు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్‌కు ఒప్పుకోలేదని కొత్త పెళ్లికూతురికి గుండు

June 28, 2019

Newly wedded woman tonsured in bihar .

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కామంతో కళ్లుమూసుకుపోయి కొందరు, ధనబలం, కండబలంతో మరికొందరు స్త్రీలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. తాము అత్యాచారం చేయబోతే ప్రతిఘటించారంటూ నవ వధువుతోపాటు ఆమె తల్లికి కూడా గుండుకొట్టి ఊరేగించారు దుర్మార్గులు. బిహార్‌లోని వైశాలి జిల్లా భగవాన్ పూర్ ప్రాంతంలో ఈ దారుణం జరిగిది. ఓ గ్రామానికి చెందిన నిరుపేద యువతి(19)కి ఇటీవలే పెళ్లయింది. గ్రామ వార్డు కౌన్సిలర్ మహ్మద్ ఖుర్షీద్, మరో ఆరుగురు ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఆమె తల్లి కూడా అడ్డుపడింది. దీంతో నీచ మూక వెళ్లిపోయింది.

తర్వాత మరికొందరిని తీసుకొచ్చి దాడి చేశారు. తల్లీకూతుళ్లను ఇంట్లోంయి బయటికి తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. ఊరిలో కొందరు పెద్దలు కూడా ఈ అకృత్యానికి వత్తాసు పలికారు. అత్యాచారాన్ని అడ్డుకోవడం తప్పంటూ శిక్షగా గుండుకొట్టించి ఊరేగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలని కుటుంబం భిక్షాటన చేసుకుని జీవిస్తోంది. అత్యాచారయత్నం సమయంలో ఇంటి పెద్ద భిక్ష కోసం బయటికి వెళ్లాడు. ఖుర్షిద్‌ గతంలోనూ పలు నేరాలకు పాల్పడ్డాడని, అమ్మాయిలతో వ్యభిచార గృహాలకు అమ్మాడని పోలీసులు చెప్పారు.