శోభనం రాత్రే గ్యాంగ్‌రేప్ చేశారు.. నరబలికీ ప్లాన్..   - MicTv.in - Telugu News
mictv telugu

శోభనం రాత్రే గ్యాంగ్‌రేప్ చేశారు.. నరబలికీ ప్లాన్..  

September 29, 2018

పెళ్లైన మొదటి రాత్రే భర్తతో పాటు అతని బంధువులు, నలుగురు తాంత్రికులు సామూహిక అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్యానాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కురుక్షేత్రలోని బాబెయిన్‌కి చెందిన అమ్మాయి(22)కి సెప్టెంబర్ 12న పెళ్లి జరిగింది. మరుసటి రోజు ఆ నవ దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు.పెళ్లిరోజు ఆమె భర్త, బంధువులు, తాంత్రిక పూజల కోసం పక్కా ప్లాన్ చేసుకున్నారు. భర్త నలుగురు తాంత్రికులను పిలిపించాడు. పూజలో తన తల్లిదండ్రులు, సోదరి, బావ, సోదరుడు కూడా పాల్గొనాలని సూచించాడు.

trt

 

సెప్టెంబర్ 13న శోభనం రోజు తన భార్యకు పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన వెంటనే గదిలోకి తీసుకెళ్లి ఒకరి తరవాత ఒకరు భర్త, అతని సోదరుడు, భర్త బావ,  నలుగురు తాంత్రికులు అత్యాచారం చేశారు. మూడు రోజుల పాటు ఘాతుకం కొనసాగించారు. తాంత్రిక పూజల అనంతరం నవవధువును బలి ఇవ్వాలని కూడాఃవారు ప్లాన్ చేసుకున్నారు. ఈ నరకం నుంచి బయటపడిన నవవధువు విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన కురుక్షేత్ర పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమ్మాయి వద్ద నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని పేర్కొన్నారు. ఈ రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ కేసులో అమ్మాయి భర్త, అతని సోదరుడు, సోదరి, బావ, తల్లి, తండ్రి, నలుగురు తాంత్రికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. అరెస్ట్ చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.