వైభవంగా పెండ్లి చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల కోసం పెద్ద హోటల్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హాల్ కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కడంతో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో వారి రిసెప్షన్ కి వారే లేకుండా అయిపోయింది. యూఎస్ లోని నార్త్ కరోలినా లో మరో నలుగురు అతిథులతో కలిసి హోటల్ లోని ఎలివేటర్ ఎక్కారు నూతన దంపతులు. పదహారవ అంతస్తులో రిసెప్షన్ జరుగుతున్నది. గ్రౌండ్ నుంచి మొదటి ఫ్లోర్ కి వెళ్లారో లేదో లిఫ్ట్ ఆగిపోయింది. రెండు గంటల పాటు ఆ దంపతులు, బంధువులు అందులోనే ఇరుక్కుపోయారు.
వారి సహాయంతో..
భారతీయ సంతతికి చెందిన పవన్, విక్టోరియా ఝా ఇటీవలే పెండ్లి చేసుకున్నారు. గ్రాండ్ బోహేమియన్ హోటల్ లో గ్రాండ్ గా విందు ఏర్పాటు చేశారు. వధువు సోదరితో సహా మరో నలుగురు ఈ లిఫ్ట్ లో ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా లిఫ్ట్ పనిచేయలేదు. ఆఖరుకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి వారిని బెల్టులతో బయటకు లాగింది. అయితే ముందు బంధువులను మాత్రం లాగి లిఫ్ట్ ని బాగు చేశారు. చివరగా వధూవరులను బయటకు తీసుకొచ్చారు.
సరదాగా కాసేపు..
‘లిఫ్ట్ ఎక్కాక కొన్నిక్షణాలకే లిఫ్ట్ ఆగిపోయింది. అయితే లిఫ్ట్ కాస్త తెరుచుకొని ఉండడంతో మేం ఊపిరి పీల్చుకోగలిగాం. రెండు గంటల పాటు అందులోనే ఉన్నాం. మేం ఇద్దరం ఉన్నం కాబట్టి హాయిగా గడిపాం’ అంటూ ప్రణవ్ చెప్పాడు. బంధువులంతా మాత్రం వీరు రిసెప్షన్ కు రాకుండా హానీమూన్ కి వెళ్లారమేనని ఆట పట్టించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది వీరి వివాహ రిసెప్షన్ కి అతిథులుగా మారి ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు.