ఆ ఛానెల్ వల్లే టమాట ధరలు తగ్గాయి.. మాజీ సీఎం వ్యాఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఛానెల్ వల్లే టమాట ధరలు తగ్గాయి.. మాజీ సీఎం వ్యాఖ్య

May 18, 2020

News Channel for Fall in Tomato Prices

టమాట ధరలు పడిపోవడానికి ఓ న్యూస్ ఛానెల కథనాలే కారణమని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృద్వీరాజ్ చవాన్ ఆరోపించారు. తిరంగ వైరస్ వచ్చిందని చెబుతూ తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేడయంతో డిమాండ్ తగ్గిందని చెప్పారు. దీని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఛానెల్ ప్రసారాలను నెల రోజుల పాటు నిషేధించాలని డిమాండ్ చేశారు. 

ఈ నెల 13న ఓ  హిందీ న్యూస్ ఛానల్ టమోటాలలో తిరంగ వైరస్ ఉందంటూ కొన్ని కథనాలను ప్రసారం చేసింది. ఫ‌లితంగా ట‌మాటా ధరలు పడిపోవడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. దీని కారణం రిపోర్టింగ్ ప్రసారం చేయడమే కారణమని పృథ్వీరాజ్ చవాన్ ట్వీట్ చేశారు. ఇటువంటి సున్నిత వార్త‌లు ప్ర‌సారం చేసేట‌ప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల‌ని సూచించారు. కేంద్ర ప్రసారా మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించాలని కోరారు. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది చాలా నష్టం కలిగించిందని పేర్కొన్నారు.