మెర్సల్‌తో కోదండరామిరెడ్డి కొడుకు ఢీ! - MicTv.in - Telugu News
mictv telugu

మెర్సల్‌తో కోదండరామిరెడ్డి కొడుకు ఢీ!

October 26, 2017

సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డి తనయుడు వైభవ్ రెడ్డి తమిళంలో నటించిన ‘మెయ్యాద మాన్’.. విజయ్ సినిమా ‘మెర్సల్‌’కు దీటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పుడు తమిళనాట ఈ సినిమా పెను సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్టుగా నిలిచింది.

తొలుత ఈ సినిమా రిలీజ్‌కు ముందు మెర్సల్ హవా నడుస్తున్నది. ఈ తరుణంలో చిన్న సినిమా విడుదలైతే పత్తా లేకుండా కొట్టుకుపోతుందని చాలా మంది సోషల్ మీడియాలో వెటకరించారు. హీరో, దర్శకుడు ఇలా మొత్తం చిత్ర యూనిట్‌ను ‘ఈ టైంలో మీ సినిమా రిలీజైతే బాగోదు.. మెర్సల్ హవా తగ్గాక విడుదల చేసుకోండి..’ అంటూ సటైరిక్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. దర్శకుడు రత్న కుమార్ స్పందిస్తూ తాను విజయ్‌కి పెద్ద ఫ్యాన్‌నని కూడా చెప్పాడు. చివరికి ఎవరి మాటలను పట్టించుకోకుండా ధైర్యంగా సినిమాను విడుదల చేశారు.

విడుదలైన మూడు రోజుల వరకు థియేటర్ల వైపు ఒక్కరు కూడా తొంగి చూడలేదు. నెమ్మదిగా ఒక్కక్కరు సినిమాకు రాసాగారు. అలా మౌత్ టాక్‌తో సినిమా పబ్లిసిటీ పుంజుకొంది. కట్‌చేస్తే జనాలు థియేటర్లకు ఎగబడటం మొదలయ్యింది. దీపావళికి విడుదలైన మెర్సల్‌కు సమానంగా నిలబడింది మెయ్యాద మాస్ కూడా. వైభవ్‌ ఇందులో ఓ స్టేజీషో సింగర్‌గా నటించాడు. ఇదయం మురళి (హృదయం మురళి) పాత్రలో వైభవ్ చక్కటి నటనను ప్రదర్శించాడు. ప్రేమకథకు తగ్గ సంగీతం, నటీనటుల ప్రదర్శన, దర్శకత్వం ఇలా అన్నీ సముపాళ్ళల్లో కుదిరి సినిమాను పెద్ద హిట్టుగా నిలబెట్టాయి.