యమహా నుంచి సూపర్ బైక్ - MicTv.in - Telugu News
mictv telugu

యమహా నుంచి సూపర్ బైక్

November 24, 2017

చురుకైన హ్యాండ్లింగ్ పనితీరు,  పవర్ డెలివరీలో అద్భుతమైన దృఢత్వంతో యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్  కొత్త సూపర్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. ఎంటీ 09 కింద కొత్త మోడల్ ను తీసుకొచ్చింది. కొత్త వెర్షన్‌తో తమ నిబద్ధతను చాటుకుంటుందని యమహా మోటార్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ తెలిపారు. దీని ధరను  రూ. 10.88 లక్షల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్)గా  నిర్ణయించింది.ఈ సరికొత్త వెర్షన్‌లో కొత్తగా అభివృద్ధి చెందిన 847 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌తో  యూత్‌ ను ఆకట్టుకునేలా ఎంటీ-09లో  రూపొందించింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీ తమ బైక్‌ ప్రత్యేకత అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 600 సి.సి. స్పోర్ట్స్ మోడల్ నుంచి అప్‌గ్రేడ్‌ అవుతున్న యువతను లక్ష్యంగా పెట్టుకుని ఇండియాలో పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి చేసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.