ఈ  డ్రైవర్ హీరో.... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ  డ్రైవర్ హీరో….

March 26, 2018

ఓ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ తన ప్రాణాలకు తెగించి పెద్ద సాహసమే చేశాడు. ఎంతోమంది ప్రాణాలను కాపాడి హీరో అయ్యాడు. అకస్మాత్తుగా ఆయిల్ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో అందరూ పారిపోయారు. కానీ అక్కడే ఉన్న ట్యాంకర్ డ్రైవర్ మాత్రం తెగించి ఆ వాహనాన్ని మంటలతోనే ముందుకు తీసుకెళ్లి వదిలేశాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఓ పెట్రోల్‌బంక్ వద్దకు పెట్రోల్‌ను అన్‌లోడ్ చేసేందుకు ఆయిల్ ట్యాంకర్ వచ్చింది. పెట్రోల్ అన్‌లోడ్ చేస్తుండగా ట్యాంకర్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. బంక్‌లో వాహనాలు, అధిక సంఖ్యలో జనాలు ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని మంటల్లో కాలిపోతున్న ట్యాంకర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ట్యాంకర్ డ్రైవర్‌కు మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. ప్రస్తుతం ట్యాంకర్ డ్రైవర్ సాజిద్ నర్సింగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాజిద్ సాహసాన్ని పలువురు  మెచ్చుకుంటున్నారు.