న్యూస్ పేపర్లకూ శానిటైజేషన్ ( వీడియో ) - MicTv.in - Telugu News
mictv telugu

న్యూస్ పేపర్లకూ శానిటైజేషన్ ( వీడియో )

March 27, 2020

Newspaper Sanitization For Readers  

ప్రపంచవ్యాప్తంగా భయానికి పర్యాయ పదంగా కరోనా వైరస్ మారిపోయింది. దీని పేరు ఎత్తితేనే ప్రజలు వణికిపోతున్నారు. ఏ రూపంలో తమను చేరిపోతుందోనని భయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ మహమ్మారి గురించి సోషల్ మీడియాలో ఇటీవల రకరకాల పుకార్లు వచ్చాయి. వార్తా పత్రికల ద్వారా సులువుగా వ్యాపిస్తుందనే వదంతులు రావడంతో చాలా మంది న్యూస్ పేపర్ వేయించుకోవడం మానేశారు. దీంతో ప్రింట్ మీడియాలో ఒక్కసారిగా స్క్యూలేషన్ తగ్గిపోయింది. కరోనా పేపర్ల ద్వారా వ్యాపించదని వైద్యులు చెబుతున్నాప్రజలకు అపోహలు పోవడం లేదు. దీంతో కొన్ని న్యూస్ పేపర్లు కొత్త పద్దతికి తెరలేపాయి. 

ప్రజల్లో భయం పోగోట్టేలా వార్తా పత్రికలపై కూడా శానిటైజర్లు చల్లి పంపిణీ చేస్తున్నారు. ప్రింటింగ్ చేస్తున్న సమయంలోనే వాటిపై శానిటైజర్లు చల్లుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హన్స్ ఇండియా న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వార్తాపత్రికను సురక్షితంగా ఉంచడంలో హాకర్లు కూడా తమ బాధ్యతగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పేపర్ బాయ్స్ కూడా ముసుగు వేసుకొని ఇంటింటికి అందజేస్తున్నారని అంటున్నారు. ప్రతిదానిలో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేనందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. చూడాలి మరి శానిటైజర్లు చల్లి అపోహలు పోగొట్టే ప్రయత్నం చేయడం వల్ల పాఠకులు తిరిగి న్యూస్ పేపర్లు చేత పట్టుకుంటారో లేదో.