గుడి వివాదం...రవీనా టాండర్‌పై పోలీస్ కేసు ! - MicTv.in - Telugu News
mictv telugu

గుడి వివాదం…రవీనా టాండర్‌పై పోలీస్ కేసు !

March 7, 2018

బాలీవుడ్ నటి రవీనా టాండర్‌పై కేసు నమోదైంది. ఒడిశా రాజధాాని భువనేశ్వర్’లో ఉన్న ప్రఖ్యాత ఆలయం లింరాజ దేవాలయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రకటనల కోసం షూటింగ్ చేశారని ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి గుడిలో కెమెరాలను సెల్ ఫోన్లను అనుమతించరు. అందుకు విరుద్దంగా  అక్కడ యాడ్ కోసం చిత్రీకరణ జరపడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రవీనా మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. తను గుడికి కేవలం దర్శనం కోసమే వెల్లినట్టు తెలిపింది. అసలు అక్కడ ప్రకటన కోసం చిత్రీకరణ జరగలేదని తెలిపింది. అక్కడికి కేవలం మీడియా మిత్రులు,అభిమానులు మాత్రమే వచ్చి తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకున్నారని తెలపింది. అయిన అక్కడ మొబైల్  ఫోన్లను అనుమతించరన్న సంగతి తనకు తెలియదని చెప్పింది. ఫొటోలు తీస్తుంటే అక్కడి అధికారులు వద్దని చెప్పలేదని రవీనా ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె గుడిలో కూర్చొని బ్యూటీ టిప్స్ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఈ కేసు నమోదైంది.