కరోనా కేసులు పెరగడంతో పాటు.. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 కేసులు భారత్లో వెలుగుచూడడం మరోసారి దేశ ప్రజల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిపై అప్రమత్తమయ్యాయి. పాతన అనుభవాలు దృష్ట్యా ముందు జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ప్రజలు సైతం జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా జాతీయ అధికారి మరో హెచ్చరిక జారీ చేశారు. వచ్చే నెల జనవరిలో కరోనా కేసులు పెరగొచ్చని..రానున్న 40 రోజులు చాలా కీలకమని ప్రకటించారు. 30-35 రోజుల తర్వాత దేశంలో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. దేశంలో కరోనా విజృంభించినా.. ఇన్ఫెక్షన్ తీవ్రత, మరణాలు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా ఉధృతి ఎక్కువైతే వచ్చే పరిస్థితులకు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ సూచించారు.