NHAI warned the authorities on road constructions
mictv telugu

అలాంటి రోడ్డు ప్రమాదాలకు అధికారులదే బాధ్యత : కేంద్రం

October 18, 2022

NHAI warned the authorities on road constructions

రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపాల వల్ల జరిగే ప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) తెలిపింది. పనుల నాణ్యత విషయంలో రాజీపడి అనుమతి సర్టిఫికెట్ జారీ చేస్తే ఉల్లంఘనగానే భావించాల్సి ఉంటుందని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అలా చేసిన ఎన్‌హెచ్ఏఐ/ఐఈ/ఏఈ విభాగాలకు చెందిన అధికారులు/ప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పాలసీ నిబంధనలు, కాంట్రాక్టు ఒప్పందంలోని షరతులకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించింది. నిర్మాణంలో ఉన్న రోడ్డుపై మార్కింగులు, సూచిక బోర్డులు, క్రాష్ బారియర్ల ఏర్పాటు వంటి చివరి పనులు పూర్తికాకుండా కొందరు అధికారులు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఈ విషయం కేంద్రం దృష్టికి రావడంతో తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి సందర్బాల్లో ప్రమాదం వల్ల గాయపడినా, మరణాలు సంభవించినా దానికి రీజనల్ ఆఫీసర్ లేదా ప్రాజెక్టు డైరెక్టర్ లేదా ఇండిపెండెంట్ ఇంజినీర్‌లను బాధ్యులను చేస్తామని స్పష్టం చేసింది.