ఎన్‌కౌంటర్‌పై NHRCకి పోలీసుల నివేదిక ఇదే - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్‌కౌంటర్‌పై NHRCకి పోలీసుల నివేదిక ఇదే

December 10, 2019

Disha 00022

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై NHRC తన దర్యాప్తును కొనసాగిస్తోంది. నిందితులు, బాధితుల కుటుంబ సభ్యులను ఇప్పటికే విచారించిన NHRC బృందం మంగళవారం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను ప్రశ్నించింది.  ఈ ఘటనలో గాయపడిన పోలీసుల వద్దకు వెళ్లి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎదురుకాల్పులు జరగడానికి కారణాలను వారు వివరించారు. పోస్టు మార్టం రిపోర్ట్, సీసీ ఫుటేజీతో సహా పూర్తి ఆధారాలతో కూడిన నివేదికను కూడా పోలీసులు NHRCకి అందించారు. 

ఆత్మరక్షణలో భాగంగానే ఈ కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. దిశ సెల్‌ఫోన్, ఇతర ఆధారాల కోసం నిందితులను సంఘన స్థలానికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఆ సమయంలోనే నలుగురు ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో తమపై దాడిచేశారన్నారు. వెంటనే తమ రివాల్వర్లు లాక్కొని దూరంగా పరిగెత్తి కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.  గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. పోలీసులకు అయిన గాయాలను కూడా NHRC బృందం పరిశీలించింది.