NIA crackdown on gangsters: Raids being conducted at 60 locations across India
mictv telugu

సింగర్ హత్యకేసు… దేశంలోని మొత్తం 60 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు

September 12, 2022

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పలు రాష్ట్రాల్లో సోమవారం భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని మొత్తం 60 ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. సిద్ధూ హత్యలో ఉగ్రముఠాల హస్తం ఉందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తోంది. హరియాణా, పంజాబ్‌ సహా దిల్లీ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. పంజాబ్‌లో గ్యాంగ్స్టర్లు గోల్దీ బ్రార్, లోరిస్ బిష్ణోయ్, భగవాన్ పురియా ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. కోటక్పురా, ఫరీద్ కోట్, రాజ్పురాలోని పలువురు గ్యాంగ్స్టర్ల్ ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. సిద్ధూ హత్యకేసులో ఉగ్రముఠాలతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని 60 ప్రాంతాల్లో గ్యాంగ్‌స్టర్లపై ఎన్ఐఏ దాడులు సిద్ధూ మూసే వాలా హత్య కేసులో గ్యాంగస్టర్లకు, ఉగ్రవాదులకు మధ్య సంబంధాలున్నాయని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ చెప్పారు. నీరజ్ బవానా గ్యాంగ్ ప్రముఖ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నీరజ్ బవానా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగులకు మధ్య యుద్ధం సాగుతుందని దర్యాప్తులో తేలింది. మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్‌ గ్యాంగ్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు. లారెన్స్‌, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్‌స్టర్లు దేశంలోని పలు జైళ్లతో పాటు, కెనడా, పాకిస్థాన్‌, దుబాయ్‌ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.