ముంబైలో డేంజరస్ టెర్రరిస్టు సర్పరాజ్ ఉన్నట్లు ముంబై పోలీసులను ఎన్ఐఏ అలర్ట్ చేసింది. విదేశాల్లో ట్రైనింగ్ తీసుకున్న సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబైకి చేరుకున్నట్లు ఎన్ఐఏ పోలీసులకు సమాచారం అందించింది. సర్ఫరాజ్ దేశానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అంటూ తెలిపింది. ఈ మేరకు టెర్రరిస్టుకు సంబంధించిన వివరాలను ముంబై పోలీసులతోపాటు. మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ పోలీసులకు కూడా ఈమెయిల్ ద్వారా పంపించింది.
ఇండోర్‌కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో టెర్రరిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడి నుంచి భారత్ కు చేరుకున్న అతడు ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఎన్ఐఏ హెచ్చరించింది. అతనితో , దేశానికి చాలా ప్రమాదకరని ఎన్ఐఏ తెలియజేసింది. విదేశాల్లో శిక్షణ తీసుకుని తాజాగా ముంబై చేరుకున్నాడని తెలిపింది. ముంబై పోలీసులు మరింత అలర్ట్ గా ఉండాలని సమాచారం అందించింది. సర్ఫరాజ్ కు సంబంధించిన ఫొటోతోపాటు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఎల్‌సీ వంటి ఇతర వివరాల్ని పోలీసులకు ఈమెయిల్ ద్వారా అందజేసింది. వీలైనంత త్వరగా ఈ డేంజరస్ వ్యక్తిని పట్టుకోవాలని కోరింది.