NIA Raids : దేశంలోని 8రాష్ట్రాల్లో 70 ప్రాంతాల్లో గ్యాంగ్‎స్టర్ నెట్‎వర్క్ పై ఎన్ఐఏ దాడులు..!! - MicTv.in - Telugu News
mictv telugu

NIA Raids : దేశంలోని 8రాష్ట్రాల్లో 70 ప్రాంతాల్లో గ్యాంగ్‎స్టర్ నెట్‎వర్క్ పై ఎన్ఐఏ దాడులు..!!

February 21, 2023

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం ఉదయం కీలక చర్యలు చేపట్టింది. దేశంలోని 8 రాష్ట్రాల్లోని 70 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేసింది. న్యూస్ ఏజెన్సీ ANI ప్రకారం, NIA బృందం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలోని 70కి పైగా చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

 

పంజాబ్ లోని 30కిపైగా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్ స్టర్, క్రిమినల్ సిండికేట్లపై ఎన్ఐఏ దాడులు చేపట్టింది. పలు చోట్ల నమోదు చేసిన కేసుల దర్యాప్తునకు సంబంధించిన దాడులు కొనసాగుతున్నాయి. గ్యాంగ్ స్టర్ నెట్ వర్క్ పై ఎన్ఐఏ దాడులు చేస్తోంది.