Niagara Falls Frozen Turns Into Winter Wonderland
mictv telugu

మంచు తుఫాన్ ఎఫెక్ట్.. గడ్డకట్టిన నయాగరా జలపాతం

December 29, 2022

Niagara Falls is all ice due to devastating blizzard

వీక్షకులను కనువిందు చేసే నయాగరా అందాలు గడ్డకట్టుకుపోయాయి. జల సవ్వడులు మూగబోయాయి. అమెరికాలో కురుస్తున్న మంచు తుఫాన్ కారణంగా నయాగరా జలపాతం పూర్తిగా మంచుతో కప్పబడి పోయింది. నీరు గడ్డకట్టకుపోయి మంచు పర్వతంలా కనిపిస్తుంది. ప్రస్తుతం నయాగరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. న్యూయార్క్, కెనడా నగరాల మధ్య నయాగరా జలపాతం ఉంది. ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాలలో మంచు తుఫాన్ విపరీతంగా కురుస్తోంది. మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు మంచు తుపానులో చిక్కుకున్నారు. మంచు ఎక్కువగా కురుస్తున్నందున ఇళ్లలో నుంచి బయటకు వస్తున్న వారికి ప్రమాదాలు వెంటాడుతున్నాయి. అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారులు, ఇళ్లు సైతం పూర్తిగా మంచులో కూరుకుపోయాయి. విద్యుత్ సౌకర్యం కూడా పూర్తి స్థంభించిపోయింది. మంచు తీవ్రత కారణంగా వేలాది విమానాలను రద్దయ్యాయి. న్యూయార్క్‌లో భారీ స్థాయిలో మంచు తుఫానులు కొన్నిరోజులపాటు కొనసాగే పరిస్థితితులున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి : 

బుర్జ్ ఖలీఫాను వర్షం నుంచి కాపాడే గొడుగు!

స్వర్గం నుంచి వచ్చిన అమృతం కాఫీ