ఐపీఎల్ వేలంలో కొందరు ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు షాక్ ఇస్తే మరికొందరిపై మాత్రం కోట్లు కురిపిస్తున్నాయి. గత సీజన్ లో పెద్దగా రాణించకపోయినా వేలంలో మరోసారి వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ సత్తా చాటాడు. అతడిని ఢిల్లీ లక్నో రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. పూరన్ కోసం ఢిల్లీ పోటీ పడి ధరను అమాంతం పెంచేసింది. చివరికి లక్నోనే దక్కించుకుంది. గత ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తరఫున ఆడిన నికోలస్ పూరన్ పెద్దగా రాణించలేదు. చెప్పుకోదగిన ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లోను విఫలమయ్యాడు. అయితే
టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌కు సారధ్యం వహించిన పూరన్ అద్భుతంగా ఆడుతుండడంతో అతడిపై లక్నో నమ్మకముంచి రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. 2022లోను పూరన్‌ను రూ. 10 కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే..
హైదరాబాద్‌కు అదిల్ రషీద్..
ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను హైదరాబాద్ రూ.2 కోట్లకు కొనింది. రషీద్ బేస్ ప్రైస్ కూడా రూ.2 కోట్లే కావడం విశేషం. హెన్రిచ్ క్లాసెన్ కూడా సన్ రైజర్స్ రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. అన్ క్యాప్డ్ జాబితాలో ఉన్న ప్రతిభావంతులపై యువకులపై హైదరాబాద్ పెట్టుబడులు పెట్టింది. వివ్రాంత్ వర్మ(2.6కోట్లు), సమర్థ వ్యాస్(రూ.20 లక్షలు), సాన్విర్ సింగ్(రూ..20 లక్షలు) ఉపేంద్ర యాదవ్ (రూ.25 లక్షలు)లను హైదరాబాద్ దక్కించుకుంది. నిషాంత్ సింధురూ.60 లక్షలకు చెన్నై కొనుగోలు చేసింది.ఫిల్ సాల్ట్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకుంది.
కేఎస్ భరత్@1.2 కోట్లు
తెలుగు తేజం, వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను గుజరాత్ 1.2 కోట్లకు దక్కించుకొంది. రూ.20 లక్షల బేస్ ప్రైస్ బరిలోకి దిగిన అతడు భారీ ధరకు అమ్ముడుపోయాడు. రంజీ ట్రోఫీలో అదరగొట్టిన జగదీశన్‌ను కోల్ కతా రూ.90 లక్షలకు దక్కించుకుంది.
ఇంగ్లాండ్ బౌలర్ టోప్లీకి రూ.1.9 కోట్లు
ఈ సారి వేలంలో బౌలర్లు నామమాత్రపు ధరలకే అమ్ముడుపోయారు. పెద్దగా ఎవరిపై ఫ్రాంచైజీలు కోట్లు ఖర్చుచేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్ టోప్లీనీ బెంగళూరు రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. భారత్ బౌలర్ ఉనద్కత్ రూ.50 లక్షలకు లక్నో దక్కించుకోగా, ఇషాంత్ శర్మను ఢిల్లీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది. జయ్ రిచర్డ్ సన్ను మంబాయి రూ.1.5 కోట్లకు సొంతం చేసుకుంది.