రహస్యంగా పెళ్లి చేసుకున్న లేడీ ర్యాపర్.. - MicTv.in - Telugu News
mictv telugu

రహస్యంగా పెళ్లి చేసుకున్న లేడీ ర్యాపర్..

October 23, 2019

ఆమె పాట పాడితే పరవశించే అభిమానులు ఎందరో. ఆమె చేయి తాకినా చాలని ఆరాటపడే పురుష పుంగవులు మరెందరో. ఎందరి గుండెల్లోనో ప్రకంపనలు రేపి చివరికి ఓ బ్యాడ్ బాయ్‌ను పెళ్లాడింది ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్. 36 ఏళ్ల నిక్కీ ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్‌బాయ్‌ కెన్నెత్‌ పెర్రీని రహస్య వివాహం చేసుకుని తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె తన ట్విటర్‌‌లో ఉన్న పేరును ‘మిసెస్‌ పెట్టీ’గా మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోకు ‘ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19’ అనే క్యాప్షన్‌ను ఇచ్చింది. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్‌ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేసింది. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీని జత చేసింది. 

View this post on Instagram

???????? Onika Tanya Maraj-Petty 10•21•19

A post shared by Barbie (@nickiminaj) on

వీడియోలో మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ ఉన్న మగ్‌లతో పాటు వధూవరులు అనే అర్థం వచ్చేలా రెండు బేస్‌బాల్‌ క్యాప్‌లు ఉన్నాయి. ఈ వీడియోను చూసి చాలామంది ఆశ్చర్యపు ఎమోజీలు పెడుతున్నారు. శుభాకాంక్షలు చెప్పక తప్పడంలేదని మరికొందరు శుభాకాంక్షలు చెబుతున్నారు. గుండెలను గాయం చేసిన నిక్కీకి పెళ్లి శుభాకాంక్షలు అని చెబుతున్నారు. ఇదిలావుండగా తన మ్యారేజ్‌ లైసెన్స్‌ గడువు ముగియనుండడంతోనే.. ఉన్నపళంగా ప్రియుడిని పెళ్లి చేసుకుందని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ రెండోసారి గ్రాండ్‌గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, జూన్ 21న ఓ రేడియోలో అధికారికంగా తాను పెళ్లి చేసుకుంటున్నానని నిక్కీ చెప్పింది. తన బాయ్‌ఫ్రెండ్‌ మ్యారెజ్‌ లైసెన్స్‌ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నానని చెప్పింది. గతేడాది నుంచి పెట్టీతో నిక్కీ డేట్‌ చేస్తోంది.